Train: తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు.. మీద నుంచి మూడు రైళ్లు వెళ్లినా ఏమీ కాలేదు!

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన రైలు డ్రైవర్
  • మత్తు వదిలిన తరువాత నిద్రలేచిన ధర్మేంద్ర
అసలే తప్పతాగున్నాడు. ఒళ్లు తెలియకుండా నడుస్తూ వెళ్లి, రైలు పట్టాలపై స్పృహ లేకుండా పడిపోయాడు. అతని పై నుంచి మూడు రైళ్లు వెళ్లాయి. ఆపై మత్తు వదలగా, నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అతని పేరు ధర్మేంద్ర. పట్టాలపై పడివున్న ఓ వ్యక్తిని గమనించిన రైలు డ్రైవర్, వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సరికి, ఆ దారిలో మూడు రైళ్లు వెళ్లాయి. పోలీసులు వచ్చిన తరువాత ధర్మేంద్ర లేచాడు. అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడాన్ని చూసిన పోలీసులు.. తాగుబోతే అయినా, మృత్యుంజయుడని అంటూ, మందలించి పంపారు.
Train
Drinker
Track
Police
Madhya Pradesh

More Telugu News