ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే చట్టాన్ని మోదీ ప్రభుత్వమే తీసుకొచ్చింది: కేసీఆర్
- ఉన్నతాధికారులతో నాలుగు గంటల పాటు సమీక్ష
- అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం సరికాదు
- దిగ్విజయ్ హయాంలోనే మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీ మూతబడింది
మోదీ తీసుకొచ్చిన చట్టంలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు అవకాశం కల్పించారని, కేంద్రం తెచ్చిన చట్టాన్నే తాము ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ఈ విషయంలో బీజేపీ నేతల రాద్ధాంతం పనికి రాదని అన్నారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్‌పై కూడా కేసీఆర్ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ హయాంలోనే ఆర్టీసీ మూతబడిన విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.