Jagan: అరకు ఎంపీ పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

  • ఢిల్లీ పర్యటన ముగించుకున్న జగన్
  • నేరుగా వైజాగ్ రాక
  • ఎంపీ మాధవి దంపతులకు ఆశీస్సులు అందజేసిన సీఎం
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చిన ఆయన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఎంపీ మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ ల వివాహం శుక్రవారం వేకువజామున జరిగింది. ఇవాళ సాయంత్రం వైజాగ్ సాయిప్రియా రిసార్ట్స్ లో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు విచ్చేసిన సీఎం జగన్ ఎంపీ మాధవి, శివప్రసాద్ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
Jagan
Araku
Goddeti Madhavi
YSRCP
Vizag

More Telugu News