TSRTC: ఆర్టీసీ సమ్మె.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం

  • కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం తొలి అడుగు
  • కార్మికులను చర్చలకు పిలిచే అవకాశం!
  • విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు ఓకే?
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె 18వ రోజుకు చేరడంతో హైకోర్టు ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కార్మికులతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 సాయంత్రం వరకు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ, అధికారుల మధ్య  సమాలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మికులను చర్చలకు ఆహ్వానించే అవకాశముందని సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల ప్రధాన డిమాండ్ మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు పిలిచే అవకాశముంది.
TSRTC
Telangana

More Telugu News