IPL: రెండు నెలల పాటు ఐపీఎల్... రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే!

  • ఐపీఎల్ లో కొత్త ప్రతిపాదనలు
  • రాత్రివేళల్లోనే మ్యాచ్
  • సన్నాహాలు చేస్తున్న బీసీసీఐ
భారత్ లో క్రికెట్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ వచ్చిన తర్వాత అది మరింత రెట్టింపైంది. అయితే, వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ ను సరికొత్తగా నిర్వహించాలని బీసీసీఐ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటివరకు వీకెండ్ రోజుల్లో రెండేసి మ్యాచ్ లు నిర్వహించేవారు. ఇకమీదట ప్రతి రోజూ ఒకే మ్యాచ్, అది కూడా రాత్రివేళల్లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ విధంగా ఐపీఎల్ నిడివి కూడా రెండు నెలలకు పొడిగించాలన్నది ఓ ప్రతిపాదన. త్వరలోనే జరిగే బీసీసీఐ పాలకమండలి సమావేశంలో తాజా ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నారు.
IPL
BCCI
Cricket
India

More Telugu News