Aishwarya Rai: మణిరత్నం భారీ చారిత్రక చిత్రంలో త్రిష?

  • చోళుల కాలానికి చెందిన కథ
  • టైటిల్ గా 'పొన్నియన్ సెల్వన్'
  • త్వరలోనే సెట్స్ పైకి  
తెలుగులో అవకాశాలు తగ్గడంతో త్రిష తమిళంలో తన కెరియర్ ను నెట్టుకొస్తూ వెళ్లింది. ఒక దశలో తమిళంలోను ఆమె పనైపోయిందని అంతా అనుకున్నారు. అనుకోకుండా ఆమె కెరియర్ మళ్లీ పుంజుకుంది. రజనీ సరసన 'పేట'తో సక్సెస్ ను అందుకున్న ఆమె, ఇటీవలే చిరూ 152 వ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఇక తమిళంలో మణిరత్నం సినిమాలోను ఆమె చేయనుందనేది తాజాగా తెరపైకి వచ్చింది. చోళుల కాలానికి చెందిన కథతో మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ .. మోహన్ బాబు .. కార్తీ .. జయం రవి వంటి నటీనటులను ఎంపిక చేసుకున్నారు. తాజాగా త్రిష పేరు వినిపిస్తోంది. ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నారట. ఇది ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడం వలన, త్రిష అంగీకరించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Aishwarya Rai
Mohan Babu
Karthi

More Telugu News