ప్రభాస్ ను కలవనున్న 'గీత గోవిందం' దర్శకుడు
- 'గీత గోవిందం'తో భారీ హిట్
- దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు
- ఇంతవరకూ సెట్ కానీ మరో ప్రాజెక్ట్
ఆయన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని కొన్ని రోజులు .. అఖిల్ తో ఉంటుందని కొన్నిరోజులు ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. తాజాగా ఆయన ప్రభాస్ కి కథ వినిపించడానికి సిద్ధమవుతున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. ప్రభాస్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేసిన పరశురామ్, ఒకటి రెండు రోజుల్లో ఆయనకి ఆ కథను వినిపించనున్నాడట. ప్రభాస్ కి కథ నచ్చితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న 'జాన్' తరువాత చేయనున్న సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.