పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో మరింతగా వర్షాలు
- రేపటికి బలపడనున్న అల్పపీడనం
- ఉత్తర వాయవ్య దిశగా పయనించే అవకాశం
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్న అధికారులు
కాగా, అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర వాయవ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.