Charan Raj: తినడానికి తిండిలేక ఫుట్ పాత్ పై పడుకున్న రోజులున్నాయి: నటుడు చరణ్ రాజ్

  • మొదటి నుంచి నటనపై ఆసక్తి 
  • తిండిలేకపోయినా ప్రయత్నాలు ఆపలేదు 
  • ఒక్కరోజులో లక్ష రూపాయలకి పైగా వచ్చాయన్న చరణ్ రాజ్
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటుడు చరణ్ రాజ్ మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో తను ఎదుర్కున్న పరిస్థితులను గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నటుడిని కావాలనే కోరిక నాలో బలంగా ఉండేది. ఆ దిశగా చాలా ఏళ్ల పాటు ప్రయత్నాలు చేశాను. తినడానికి తిండి కూడా ఉండేది కాదు .. ఫుట్ పాత్ పైనే పడుకున్న రోజులున్నాయి.

అలాంటి నేను ఆ తరువాత తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలతో బిజీ అయ్యాను. ఈ మూడు భాషల్లో తొలి అవకాశం ఇచ్చినవారి ఫొటోలకి ఉదయాన్నే నిద్రలేవగానే నమస్కరించుకుంటాను. కన్నడలో నా తొలి సినిమా 'పరాజిత' విడుదల రేపు అనగా నా దగ్గర ఒక్క పైసా లేదు. ఆ మరుసటి రోజు ఆ సినిమా విడుదల కావడం .. హిట్ టాక్ రావడంతో, నా జేబులో లక్షరూపాయలకి పైగా వున్నాయి. అలా చకచకా అడ్వాన్సులు వచ్చేశాయి" అని చెప్పుకొచ్చారు.
Charan Raj
Ali

More Telugu News