Raana: 'హౌస్ ఫుల్ 4'కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న రానా లుక్

  • పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ
  • ప్రధాన బలంగా భారీ తారాగణం  
  •  డిఫరెంట్ లుక్స్ తో రానా 
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విభిన్నమైన పాత్రలను చేస్తూ, నటుడిగా తనని తాను మరింత కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రానా మొదటి నుంచి ప్రయత్నిస్తూనే వున్నాడు. హిందీలో ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'హౌస్ ఫుల్ 4' ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 600ల సంవత్సరాల పూర్వానికి .. ప్రస్తుతానికి మధ్య, పునర్జన్మల నేపథ్యంలో సాగే కామెడీ సినిమా ఇది.

అక్షయ్ కుమార్ .. రితేశ్ దేశ్ ముఖ్ .. పూజా హెగ్డే .. కృతి సనన్ ప్రధానమైన పాత్రలను పోషించే ఈ సినిమాలో, రానా కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. రెండు డిఫరెంట్ లుక్స్ తో ఆయన ఆకట్టుకోనున్నాడు. ఒక లుక్ లో ఆయన క్షుద్ర మాంత్రికుడిగా కనిపించనున్నాడనే విషయం తెలుస్తోంది. వికృతమైన రూపంతో .. 'గబ్బిలం' చిహ్నం కలిగిన మంత్రదండంతో ఆయన కనిపిస్తున్నాడు. ఈ పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో రానా వున్నాడు.

Raana
Akshay
Rithesh
Pooja
Krithi

More Telugu News