Katrina Kair: నయనతారకు ధన్యవాదాలు చెప్పిన కత్రినాకైఫ్

  • వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన కత్రిన
  • 'కే బై కత్రిన' పేరుతో సౌందర్య ఉత్పత్తులు
  • నయనతారతో కలసి వీడియో షూట్
దక్షిణాదిన అగ్రతారగా కొనసాగుతున్న నయనతారకు బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ధన్యవాదాలు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, బాలీవుడ్ లో బిజీగా ఉన్న కత్రిన సౌందర్య ఉత్పత్తుల వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. 'కే బై కత్రిన' పేరుతో తన సొంత బ్రాండ్ ను ప్రారంభించింది. తన ప్రాడక్ట్స్ ప్రచారం కోసం నయనతారతో కలిసి ఓ వీడియోను రూపొందించింది. సినిమా షూటింగులతో బిజీగా ఉన్న నయనతార... ముంబైకి వచ్చి షూటింగ్ లో పాల్గొనడంపై కత్రిన థ్యాంక్స్ చెప్పింది. దక్షిణాది అందమైన నటికి ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో పాటు షూటింగ్ సందర్భంగా తీసిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
Katrina Kair
Nayanatara
Kay by Katrina
Bollywood
Tollywood

More Telugu News