Chandan: పెళ్లికి దారితీసిన 'కన్నడ బిగ్ బాస్' హౌస్ ప్రేమ... వైభవంగా చందన్, నివేదితల నిశ్చితార్థం!

  • కన్నడ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న జంట
  • హౌస్ లోనే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ
  • సోమవారం బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం
బిగ్ బాస్ హౌస్ లో వారి పరిచయం ప్రేమగా మారగా, ఇప్పుడు పెళ్లికి దారితీసింది. కన్నడ ర్యాపర్ స్టార్ చందన్, నటి నివేదితా గౌడ్ లు బిగ్ బాస్ కన్నడ సీజన్ -6లో పాల్గొన్నారు. అక్కడ వారిద్దరూ మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుమించి వారి మధ్య ప్రేమ చిగురించింది.

తమ ప్రేమ గురించి ఇటీవలి దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఓ వేదికపై తమ వివాహాన్ని వీరు ప్రకటించారు. దసరా ఉత్సవాల వేదికపై పెళ్లి ప్రకటన ఏంటని విమర్శలు రాగా, క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా నిన్న చందన్, నివేదితల నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని, అభిమానుల సమక్షంలో తమ వివాహం జరుగుతుందని ఈ సందర్భంగా వారిద్దరూ తెలిపారు.
Chandan
Nivedita
Marriage
Engagement

More Telugu News