High Court: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల వ్యాజ్యాలు 
  • నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై అభ్యంతరాలు
  • వ్యాజ్యాలను కొట్టేసిన న్యాయస్థానం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఈ ఎన్నికలను ఆగస్టు 15లోపే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.

మరోవైపు, నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని కూడా పిటిషనర్లు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. తాజాగా దానిని తొలగించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
High Court
elections
Telangana

More Telugu News