Charan raj: స్టేజ్ పై నన్ను చూసి ఎన్టీఆర్ గారు అయోమయంలో పడ్డారు: నటుడు చరణ్ రాజ్

  • 'ప్రతిఘటన'కి బెస్ట్ విలన్ గా అవార్డు వచ్చింది 
  • అన్నగారి చేతుల మీదుగా అందుకున్నాను 
  • అది ఒక తీపి జ్ఞాపకమన్న చరణ్ రాజ్
తెలుగు తెరపై ప్రతినాయక పాత్రల ద్వారా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నవారిలో చరణ్ రాజ్ ఒకరిగా కనిపిస్తారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన సంఘటనను గురించి ప్రస్తావించారు. 'ప్రతిఘటన' సినిమాలో ప్రతినాయకుడిగా చేసినందుకుగాను నాకు బెస్ట్ విలన్ గా నంది అవార్డు వచ్చింది. ఆ అవార్డును నేను ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా అందుకోవడం కోసం వేదికపైకి ఎక్కాను.

అయితే ఆ సినిమాలో నన్ను గెడ్డం మీసాలతో చూసిన ఎన్టీఆర్ గారు స్టేజ్ పై గుర్తుపట్టలేదు. 'చరణ్ రాజ్' అంటే ఇతనేనా?' అని పక్కనే వున్నవారిని అడిగి సందేహాన్ని తీర్చుకున్నారు. 'చరణ్ రాజ్ అంటే మధ్య వయసు ఉంటుందని అనుకున్నానయ్యా .. కాలేజ్ కుర్రాడిలా నువ్వు ఇంత స్లిమ్ గా ఉంటావని అనుకోలేదు' అంటూ ఆయన నన్ను ఆప్యాయంగా హత్తుకుని అవార్డును ఇచ్చారు. అది నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మారిపోయింది' అని చెప్పుకొచ్చారు.
Charan raj
Ali

More Telugu News