Chandrababu: చంద్రబాబుకు దమ్ముంటే మా అవినీతిని నిరూపించాలి: మంత్రి ధర్మాన సవాల్

  • మా అవినీతిని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా
  • చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి
  • రానున్న ఐదేళ్లలో టీడీపీ కనుమరుగు ఖాయం
వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మంత్రి ధర్మాన కృష్ణ దాస్ సవాల్ విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పై బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే తమ అవినీతిని నిరూపించాలని, నిరూపిస్తే కనుక తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇప్పటికైనా చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. గతంలో టీడీపీ పాలనలో చంద్రబాబు చేసిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు.
Chandrababu
Telugudesam
YSRCP
Dharmana

More Telugu News