Pragathi Bhavan: రేవంత్ రెడ్డిని అనేక ప్రాంతాలు తిప్పుతూ.. చివరికి కామాటిపుర పీఎస్ కు తరలించిన పోలీసులు

  • ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన రేవంత్
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వాహనాలు మార్చుతూ రేవంత్ ను తరలించిన పోలీసులు
హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రగతి భవన్ కు బైక్ పై దూసుకొచ్చిన రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ప్రాంతాలకు తిప్పారు. ప్రగతి భవన్ నుంచి గోల్కొండ ప్రాంతంలో ఉన్న గోల్ఫ్ కోర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని మరో వాహనంలోకి మార్చారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డు, పుప్పాల గూడ, నార్సింగ్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడినుంచి చివరిగా కామాటిపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Pragathi Bhavan
KCR
Revanth Reddy
TRS
Congress
Hyderabad

More Telugu News