Devineni Avinash: నాపై వస్తున్న వదంతులు నమ్మవద్దు: దేవినేని అవినాష్
- మీడియాతో మాట్లాడిన తెలుగు యువత అధ్యక్షుడు
- ఓర్వలేక తనపై పుకార్లు పుట్టిస్తున్నారని వెల్లడి
- ఎప్పుడూ అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తాజా పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అవినాష్ పార్టీ మారుతున్నాడంటూ కథనాలు వినిపించడం తెలిసిందే. దీనిపై అవినాష్ స్పందిస్తూ, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాల్లో నిజం లేదని, టీడీపీలో తన ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని తెలిపారు.
ఇలాంటి ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. ప్రజాసమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని, టీడీపీ కార్యకర్తలకు, దేవినేని నెహ్రూ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కొడాలి నానిపై ఓటమిపాలయ్యారు.