Andhra Pradesh: రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

  • రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్న జగన్
  • కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
  • రేపు రాత్రికి ఢిల్లీలోనే బస
ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి వెళుతున్న జగన్, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్టు సమాచారం. రేపు రాత్రికి ఢిల్లీలోనే ఆయన బస చేస్తారని తెలుస్తోంది. విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, రేపు ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. అనంతరం, పది గంటలకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
Andhra Pradesh
cm
Jagan
Vijayawada

More Telugu News