Catherine Tresa: అరుదైన వ్యాదితో బాధపడుతున్న క్యాథరిన్ ట్రెసా

  • తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన క్యాథరిన్
  • అనోస్మియా వ్యాధితో బాధపడుతున్న వైనం
  • వాసనలు గుర్తించలేకపోవడమే అనోస్మియా వ్యాధి లక్షణం
తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, పైసా చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన క్యాథరిన్ ట్రెసా కొంతకాలంగా తమిళ చిత్రసీమకే పరిమితమైంది! చాన్నాళ్ల తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో మళ్లీ వస్తోంది. ఎంతో ప్రతిభావంతులైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న ట్రెసా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందట. తనే స్వయంగా ఈ విషయం చెప్పింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు అనోస్మియా అనే వ్యాధి ఉందని తెలిపింది. అనోస్మియా బాధితులు ఎలాంటి వాసనలు ఆఘ్రాణించలేరు. వారు మంచి వాసనలే కాదు, చెడు వాసనలు కూడా గుర్తించలేరు. వాసనలు గుర్తించే శక్తి వారిలో శూన్యం అని చెప్పాలి. ఈ జబ్బు కారణంగా పెళ్లి చేసుకోకూడదని భావిస్తున్నానని, అయితే సినిమాల్లో నటనకు ఈ లోపం అడ్డంకి కాదని భావిస్తున్నానని పేర్కొంది.
Catherine Tresa
Tollywood
Kollywood

More Telugu News