MAA: ‘మా’ కమిటీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి: జీవితా రాజశేఖర్

  • వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం
  • ఈసీ మీటింగ్ లో ఈ సమస్య  పరిష్కారం కుదరలేదు
  • వేరేదారి లేక, కమిటీ మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేశాం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు నరేశ్ లేకుండా ఈరోజు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ సెక్రటరీ జీవితా రాజశేఖర్ ను మీడియా పలకరించింది. వాస్తవానికి, మీడియాతో మాట్లాడాలని అనుకోలేదని, రావద్దని ఎంత చెప్పినా వచ్చారు కనుక, మాట్లాడుతున్నానని జీవితారాజశేఖర్ అన్నారు. ‘మా’లోని ఇరవై ఆరు మంది కమిటీ మెంబర్స్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి’ అని, వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఈసీ మీటింగ్ లో ఈ సమస్యను పరిష్కరించుకుందామంటే కుదరలేదు అని, వేరేదారి లేక, కమిటీ మెంబర్స్ ను పిలిచి సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ‘మా’కు సంబంధించిన పనులు సక్రమంగా ఎలా చేసుకోవాలన్న డిష్కషన్ మాత్రమే జరిగిందని అన్నారు.
MAA
Secretary
Jeevita Rajasheker
president

More Telugu News