పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై శతఘ్నులతో భారత్ దాడి.. 15 మంది ఉగ్రవాదుల హతం
- ఆర్మీ పోస్టులూ ధ్వంసమైనట్లు సమాచారం
- పీవోకేలో నక్కిన ఉగ్రవాదులు
- నీలం ఘాట్ ప్రాంతంలో దాడులు
మరోవైపు, భారత సైనికులే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో పీవోకేలో భారత్ దాడులు చేసింది. ఈ దాడులు తాంగ్ధర్ సెక్టార్కు ఎదురుగా ఉండే నీలం ఘాట్ ప్రాంతంలో జరిగాయి. పీఓకేలో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టాయని భారత సైన్య ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ వివరాలను ఆర్మీ అధికారులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.