GVL: చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటే మా నేతలతో మాట్లాడతా: జీవీఎల్

  • చంద్రబాబుపై జీవీఎల్ వ్యాఖ్యలు
  • రాజకీయ భవిష్యత్ గురించే చంద్రబాబు ఆందోళన అంటూ విమర్శలు
  • తప్పుచేశానని ఇప్పుడు బాధపడుతున్నాడని వెల్లడి
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర వ్యవహారాలపై వ్యాఖ్యానించారు. చంద్రబాబును బీజేపీకి దగ్గర చేస్తానని సుజనా చౌదరి చెప్పిన విషయం తనకు తెలియదని అన్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన సుజనా చౌదరికి టీడీపీ అంటే కొంత అభిమానం ఉండొచ్చని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఇప్పుడు రాజకీయ భవిష్యత్ గురించే ఆందోళన అని ఎద్దేవా చేశారు. చిదంబరం వంటి నేతల పరిస్థితి చూసి చంద్రబాబు భయపడుతున్నారేమోనని వ్యాఖ్యానించారు.

అన్నీ కోల్పోయిన టీడీపీతో కలవడం వల్ల బీజేపీకి నష్టమేనని అన్నారు. అయితే చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటే మాత్రం తమ అగ్రనేతలతో మాట్లాడతానని జీవీఎల్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అప్పట్లో చెప్పినా వినలేదని, తప్పుచేశానని ఇప్పుడు బాధపడుతున్నాడని తెలిపారు.
GVL
Chandrababu
BJP
Telugudesam

More Telugu News