Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. క్రికెట్ బ్యాట్ పట్టిన రాహుల్ గాంధీ!

  • హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న విచిత్రం
  • అలరిస్తున్న రాహుల్ క్రికెట్ ఆడుతున్న వీడియో
  • రివాడీలోని ఒక కాలేజీ మైదానంలో స్థానిక యువకులతో క్రికెట్ ఆట
రాహుల్ గాంధీ క్రికెట్ బ్యాట్ పట్టడం ఎప్పుడైనా చూశారా.. ఇదిగో ఇది చదవండి రాహుల్ క్రికెట్ ఆడుతున్న వీడియోకు సంబంధించిన వివరాలు.. ఎక్కడా అనుకుంటున్నారా.. హర్యానా అసెంబ్లీ  ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ ప్రచారం అనంతరం హెలీకాప్టర్ లో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతో మధ్యలో రివాడీ లోని కేఎల్పీ కాలేజీ మైదానంలో హెలీకాప్టర్ ను లాండ్ చేశారు.

 ఆ సమయంలో మైదానంలో ఒక పక్క కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతుండటంతో్ తాను కూడా వారితో మాట కలిపి ఆటలో పాల్గొన్నారు. బ్యాట్ చేత పట్టి యువకుల బౌలింగ్ లో భారీ షాట్లను ఆడారు. రాహుల్ క్రికెట్ ఆడుతున్న వీడియోను ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అభిమానులను అలరిస్తోంది. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు.
Rahul Gandhi
Congress
Rewari
KLP College
Haryana
Cricket

More Telugu News