tsrtc: అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి: అశ్వత్థామరెడ్డి డిమాండ్

  • తెలంగాణలో బంద్ కొనసాగుతోంది
  • బంద్ కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు కృతఙ్ఞతలు
  • ఈరోజు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం
తెలంగాణలో బంద్ కొనసాగుతోందని టీఎస్సార్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బంద్ కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిని, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
tsrtc
Jac
chairman
Aswathama reddy

More Telugu News