tsrtc: బంద్ కు మద్దతుగా నిలిచిన ‘జన సేన’ తెలంగాణ ఇంఛార్జి అరెస్ట్ !

  • కూకట్ పల్లి ఆర్టీసీ డిపో దగ్గర నిరసన తెలిపిన ‘జనసేన’
  • నేమురి శంకర్ గౌడ్ సహా కార్యకర్తల అరెస్టు
  • బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచాయి. నిరసన వ్యక్తం చేసిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల బంద్ కు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

కూకట్ పల్లి ఆర్టీసీ డిపో దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ‘జనసేన’నేతలు ఖండించారు.
tsrtc
janasena
incharge
shanker goud
strike

More Telugu News