Yanamala: సాక్షులను ప్రభావితం చేసే అవకాశం మరింత పెరిగింది: జగన్ పై యనమల ఆరోపణలు

  • ప్రజాధనం వృథా అవుతుందన్న పేరుతో కోర్టుకు వెళ్లకుండా ప్రయత్నాలు
  • అవన్నీ జగన్ సొంత కేసులే 
  • వీటి ఖర్చులు కూడా ఆయనే భరించాలి
ప్రజాధనం వృథా అవుతుందన్న పేరుతో అవినీతి కేసుల్లో న్యాయస్థానానికి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నాలు జరుపుతున్నారని ఏపీ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు. అవి అన్నీ జగన్ సొంత కేసులే కాబట్టి వీటి ఖర్చులు కూడా ఆయనే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.

అవినీతి కేసుల్లో ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం మరింత పెరిగిందని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ కేసుల్లో ఉన్న సహనిందితులు, సాక్షులకు జగన్ ఉన్నత పదవులు ఇచ్చారని ఆయన అన్నారు. జగన్.. రాజకీయ నేతలతో పాటు మీడియాపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
Yanamala
YSRCP
Jagan
Telugudesam

More Telugu News