Amitabh Bachchan: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆసుపత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్

  • మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరిన బిగ్ బి
  • సాధారణ వైద్య పరీక్షల కోసమేనన్న ఆసుపత్రి వర్గాలు
  • మంగళవారం నుంచి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్
కాలేయ సంబంధిత వ్యాధితో మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ శుక్రవారం రాత్రి 9:45 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు నానావతి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాధారణ వైద్య పరీక్షల కోసమే అమితాబ్ ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పినప్పటికీ ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు.

మరోవైపు, అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని షో నిర్వాహకులు తెలిపారు. కాగా, తాను టీబీ, హెపటైటిస్-బి వ్యాధుల నుంచి కోలుకున్నానని అయితే, తన కాలేయంలో 75 శాతం దెబ్బతిన్నదని అమితాబ్ ఇటీవల ప్రకటించారు.
Amitabh Bachchan
Bollywood
hospital

More Telugu News