Jagan: మాజీ ఎంపీ కుమారుడి నిశ్చితార్థం కోసం సీఎం జగన్ హైదరాబాద్ పయనం

  • ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి కుమారుడి నిశ్చితార్థం
  • ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ లో కార్యక్రమం
  • తాజ్ కృష్ణలో మరో శుభకార్యానికి కూడా వెళ్లనున్న జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పయనం అయ్యారు. ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి కుమారుడి నిశ్చితార్థం కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ లో నిశ్చితార్థం జరగనుంది. ఈ కార్యక్రమం అనంతరం హోటల్ తాజ్ కృష్ణలో జరిగే మరో శుభకార్యానికి కూడా సీఎం హాజరుకానున్నారు. తాజ్ కృష్ణలో మెదక్ ఎస్పీ చందనదీప్తి, వ్యాపారవేత్త బలరాంల వివాహమహోత్సవానికి సతీసమేతంగా వెళ్లనున్నారు.. ఇవాళ జగన్ అనేక సమీక్ష సమావేశాలతో బిజీగా గడిపారు. ఆరోగ్యశ్రీ, గ్రామసచివాలయాలపై ఆయన వేర్వేరుగా సమీక్షలు జరిపారు.
Jagan
Hyderabad
Telangana
Andhra Pradesh
YSRCP

More Telugu News