IPL: ఐపీఎల్ లో తొలిసారి ఓ మహిళా మసాజ్ థెరపిస్ట్

  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహాయక బృందంలో మహిళ
  • నవనీత గౌతమ్ నియామకం
  • సోషల్ మీడియాలో వెల్లడించిన ఆర్సీబీ
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తొలిసారి ఓ మహిళా మసాజ్ థెరపిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరు నవనీత గౌతమ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆమె ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షించనున్నారు. ఆర్సీబీ ప్రధాన ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ వ్యవహరిస్తుండగా, ఆయనకు సహాయకురాలిగా నవనీత వ్యవహరిస్తారని బెంగళూరు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ సోషల్ మీడియాలో ఈ విషయం తెలిపింది. ఐపీఎల్ జట్ల సహాయక బృందాల్లో ఇప్పటివరకు ఎవరూ మహిళలు లేరు. తొలిసారి ఓ మహిళకు బాధ్యతలు అప్పగిస్తుండడం పట్ల గర్విస్తున్నామని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి.
IPL
Banglore
RCB
Navnita Gautam

More Telugu News