Telugudesam: విపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు: చంద్రబాబు

  • ఈ ప్రభుత్వానివన్నీ ప్రజావ్యతిరేక విధానాలు
  • వీటిపై ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు దాఖలు చేస్తాం
  • ఆచరణ సాధ్యంకాని హామీలతో మోసం చేస్తున్నారు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని, విపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఖజానాలో చిల్లిగవ్వలేకున్నా ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పాలన అవినీతి మయం అంటూ ఆరోపించిన అధికార పార్టీ ఐదు నెలల కాలంలో కనీసం ఒక్కటైనా నిరూపించలేకపోయిందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరుపై ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
Telugudesam
Chandrababu
YSRCP
finance position

More Telugu News