neethi ayog: పెట్టుబడిదారులు ఏపీ వైపు కన్నెత్తి చూడడం లేదు: యనమల

  • నీతి అయోగ్‌ నివేదిక ఇందుకు సాక్ష్యం
  • దక్షిణాదిలో రాష్ట్రం చిట్టచివరిన ఉండడం దురదృష్టం
  • రాష్ట్ర ప్రగతి పతానావస్థకు చేరింది
రాష్ట్రంలో ప్రగతి పతనావస్థకు చేరిందని, పెట్టుబడిదారులు ఎవరూ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు నీతి అయోగ్‌ నివేదిక సాక్ష్యమని చెప్పారు. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో నిలిచిందని, దక్షిణాదిలో చిట్ట చివరిన ఉందని గుర్తు చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించామన్నారు. జగన్‌ హయాంలో తలసరి ఆదాయం రూ.17 వేలకు పడిపోయిందని చెప్పారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి లేవని స్పష్టమవుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలన్నారు.
neethi ayog
Yanamala
state finance

More Telugu News