Giri Babu: కృష్ణంరాజు హీరోగా మారడం విలన్ గా నాకు కలిసొచ్చింది: నటుడు గిరిబాబు

  • మోహన్ బాబు నాకు మంచి స్నేహితుడు 
  • ఇద్దరం కలిసి ఒకే రూములో ఉండేవాళ్లం 
  • అలా విలన్ గా బిజీ అయ్యానన్న గిరిబాబు
విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా గిరిబాబు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."నేను, మోహన్ బాబు ఒకే రూములో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతుండే వాళ్లం. ముందుగా 'జగమేమాయ'తో నాకు అవకాశం వచ్చింది. ఆ తరువాత 'స్వర్గం నరకం' సినిమాతో మోహన్ బాబుకి ఛాన్స్ వచ్చింది. ఇద్దరం కూడా ఏడాదికి 25 సినిమాలు చేసేవాళ్లం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మా మధ్య స్నేహం అలాగే వుంది.

ఇక కృష్ణంరాజు హీరోగా చేసిన 'చిలక గోరింక' పరాజయంపాలు కావడంతో ఆయన విలన్ వేషాలు వేస్తూ వస్తున్నారు. ఆ తరువాత వచ్చిన క్రేజ్ తో హీరోగా మారాడు. దాంతో ఆయనకి రావలసిన విలన్ పాత్రలన్నీ నాకు వచ్చేవి. అప్పటి నుంచి నేను విలన్ పాత్రల ద్వారా మరింత బిజీ అయ్యాను" అని చెప్పుకొచ్చారు.
Giri Babu
Krishnam Raju
Mohan Babu

More Telugu News