Narendra Modi: ఇలాంటి ఆలోచనలకు మీరు సిగ్గుపడాలి: ప్రతిపక్షాలపై మోదీ ఫైర్

  • ఆర్టికల్ 370 రద్దుకు, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఏమిటన్న ప్రతిపక్షాలు
  • సంబంధం లేదని ఎలా అనగలరని ప్రశ్నించిన మోదీ
  • ప్రతిపక్షాల వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్న ప్రధాని
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాలపై ప్రధాని మోదీ పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టికల్ 370 రద్దుకు, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఏమిటంటూ విపక్షాలు ప్రశ్నిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జమ్ముకశ్మీర్ కు, మహారాష్ట్రకు సంబంధం లేదని వారు ఎలా అనగలరని ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచనలకు సిగ్గు పడండి... లేదా మునిగి చావండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ జన్మించిన గడ్డపై రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు తనకు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు.
Narendra Modi
Article 370
Jammu And Kashmir
Maharashtra
BJP
Congress

More Telugu News