Chandrababu: టీడీపీ పథకాలన్నిటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది: చంద్రబాబునాయుడు విమర్శ

  • ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం
  • అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది మా పార్టీ లక్ష్యం
  • పేదల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలి
వైసీపీ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి, అన్న క్యాంటీన్ వంటి పథకాలను పునరుద్ధరించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది తమ పార్టీ ప్రధాన లక్ష్యం అని అన్నారు. నాటి కిలో రూ.2 బియ్యం పథకం నుండి నిన్నటి ‘అన్న క్యాంటీన్’ వరకు టీడీపీ పథకాలన్నీ ఈ లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని అన్నారు. కేవలం, టీడీపీ పథకాలు అన్న కారణంగా వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, పేదలను విస్మరించిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించాలని, పేదలకు ఆహారభద్రత కల్పించాలని సూచించారు.


Chandrababu
Telugudesam
YSRCP
cm
jagan

More Telugu News