Jamuna: ఆ హీరో వచ్చి నా తలపై పడ్డాడు: సీనియర్ హీరోయిన్ జమున

  • ఏవీఎమ్ నా మాతృ సంస్థ వంటిది 
  • ఆ బ్యానర్లో 14 సినిమాలు చేశాను 
  • తమిళ మూవీ షూటింగులో అలా జరిగిందన్న జమున
తెలుగు తెరపై అలనాటి అందాల చందమామగా జమునకి పేరు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకి హెడ్ షేక్ రావడానికి గల కారణాన్ని గురించి ప్రస్తావించారు. "ఏవీఎమ్ నా మాతృ సంస్థ వంటిది. ఆ బ్యానర్లో నేను 14 సినిమాల వరకూ చేశాను. తెలుగులోని 'లేత మనసులు' సినిమాను తమిళంలో తీస్తున్నారు. ఆ రోజున 'అందాల ఓ చిలుక .. ' పాటను తమిళంలో చిత్రీకరిస్తున్నారు.

హీరో జయశంకర్ .. హరనాథ్ మాదిరిగానే పొడగరి .. అంతకంటే బలంగా ఉండేవారు. ఈ పాటలో ఆయన 'గడ్డివాము' పై నుంచి జారుతూ వచ్చి నా ఒళ్లో వాలిపోవాలి. రిహార్సల్స్ సమయంలో బాగానే చేశారు. టేక్ చేసేటప్పుడు అయన నేరుగా వచ్చి నా తలపై పడ్డారు. ఆ సమయంలో తల చాలా నొప్పిగా అనిపించింది. కొంతకాలం తరువాత హెడ్ షేక్ కావడమనే సమస్య బయటపడింది" అని చెప్పుకొచ్చారు.
Jamuna

More Telugu News