కేసీఆర్ ఫాంహౌస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

  • మీడియాతో మాట్లాడిన వెంకటేశ్వర్లు కుమారుడు
  • అనిల్ అనే మరో కానిస్టేబుల్ పై ఆరోపణలు 
  • ఏదైనా జరిగితే ఆ బాధ్యత అనిల్ దేనని నాన్న చెప్పారు 
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అనిల్ అనే మరో కానిస్టేబుల్ పై వారు పలు ఆరోపణలు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు కుమారుడు మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రిపై అనిల్ పదే పదే దాడులు చేసేవారని అన్నారు.

తన తండ్రితో తాను నిన్న మాట్లాడానని, తనపై దాడి జరిగిందని ఆయన మరోసారి తెలిపారని అన్నారు. తనకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత అనిల్ దేనని తన తండ్రి ఫోనులో చెప్పారని వివరించారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉన్నట్లు సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
KCR
Telangana

More Telugu News