Telangana: సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

  • గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • యాదాద్రి జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు
  • మద్యానికి బానిసయ్యాడన్న పోలీసు అధికారులు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆయనను అక్కడి సిబ్బంది వెంటనే గజ్వేల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్వర్లు స్వస్థలం యాదాద్రి జిల్లా వలిగొండ గ్రామం అని తెలిసింది. అయితే, ఆయన మద్యానికి బానిసయ్యాడని సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన కొంత కాలం సెలవులు తీసుకొని ఇటీవలే తిరిగి విధుల్లో చేరారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన మద్యం మత్తులోనే ఉన్నట్లు వివరించారు.
Telangana
KCR

More Telugu News