Kalki Bhagawan: 'కల్కి భగవాన్' ఆశ్రమాలపై ఐటీ దాడులు.. కలకలం

  • వరదయ్యపాలెం ఆశ్రమంతో పాటు 25 చోట్ల తనిఖీలు
  • నాలుగు బృందాలుగా విడిపోయి తనిఖీలు
  • కల్కి ఆశ్రమ సీఈవోను ప్రశ్నిస్తున్న అధికారులు
కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆశ్రమాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం ఆశ్రమంతో పాటు తమిళనాడులోని 25 చోట్ల ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. కల్కి ఆశ్రమ సీఈవో లోకేశ్ దాసాజీని కూడా ప్రశ్నిస్తున్నారు. కల్కి ఆశ్రమంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఏక కాలంలో దాడులను నిర్వహిస్తున్నారు. సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Kalki Bhagawan
IT
Raids

More Telugu News