మోదీ వ్యాఖ్యలతో భావోద్వేగానికి లోనైన రెజ్లర్ బబితా ఫొగాట్
- ఛార్ఖీ దాద్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బబిత
- రెజ్లర్ బబితా ఫొగట్ కోసం మోదీ ప్రచారం
- అవకాశాలు ఇస్తే అమ్మాయిలు సత్తా చాటుతారని వ్యాఖ్య
ఛార్ఖీ దాద్రి స్థానం నుంచి రెజ్లర్ బబితా ఫొగాట్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగానే అమీర్ ఖాన్ చిత్రం 'దంగల్' తెరకెక్కింది. ఈ సందర్భంగా బబిత గురించి మోదీ మాట్లాడుతూ, 'దంగల్' సినిమాను చూశానని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ మధ్యే తనతో చెప్పారని తెలిపారు. ఆ విషయం విని తాను ఎంతో గర్వపడ్డానని... అవకాశం ఇస్తే ఆడపిల్లలు వారి సత్తా చాటుతారని అన్నారు. మోదీ మాటలతో బబిత కాసేపు భావోద్వేగానికి లోనయ్యారు.