annavaram: అన్నవరంలో దారుణం.. ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్య.. ఘాటుగా స్పందించిన పవన్

  • తొండింగి అర్బన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ
  • కత్తితో నరికి చంపిన దుండగులు
  • నెల రోజుల క్రితం కూడా హత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను కత్తితో నరికి చంపారు. తొండంగి అర్బన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ హత్యతో గ్రామంలో విషాద
ఛాయలు అలముకున్నాయి.

సత్యనారాయణ హత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. దీనిని ఆటవిక చర్యగా పేర్కొన్న పవన్.. భయపెడితే తప్ప కలానికి సంకెళ్లు వేయలేమనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పాల్పడినట్టు అనిపిస్తోందన్నారు. నెల రోజుల క్రితం కూడా సత్యనారాయణపై హత్యాయత్నం జరిగినా పోలీసులు ఆయనకు రక్షణ కల్పించకపోవడం దారుణమన్నారు. ఆయన కుటుంబానికి పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
annavaram
East Godavari District
reporter
andhrajyothy
murder

More Telugu News