Komatireddy: మంచి పేరు చెడగొట్టుకోకు... ఏపీ సీఎం జగన్ కు ఎంపీ కోమటిరెడ్డి సలహా

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడంలేదని, అతనితో కలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, మీ పేరు చెడిపోతాయని కాంగ్రెస్  పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  జగన్మోహన్ రెడ్డికి పలు సూచనలు చేశారు.  

‘కేసీఆర్ కార్మిక వ్యతిరేకి. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చావడానికి ఆయనే కారణం. మీరు కేసీఆర్ తో కలవవద్దు. మీరు కలిస్తే మీ పేరు, మీ నాన్న పేరు కూడా చెడిపోతాయి’ అని జగన్ కు సూచించాడు. ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికి  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికి కేసీఆర్ ఆ పనిచేయలేకపోతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.
Go Back to Shorts
Komatireddy

More Telugu News