Roja: పంతులమ్మ అవతారం ఎత్తిన రోజా!

  • నగరి నియోజకవర్గంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
  • ఎం.కొత్తూరు పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పిన రోజా
  • విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైసీపీ నేత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా టీచర్ అవతారం ఎత్తారు. తన నగరి నియోజకవర్గంలోని ఎం.కొత్తూరు జిల్లా పరిషత్ స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పారు. అబ్దుల్ కలాం గొప్పదనాన్ని వారికి వివరించారు. కలాం స్ఫూర్తిగా జీవితంలో ఎదగాలని ప్రబోధించారు. కలాం జయంతిని పురస్కరించుకుని రోజా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజాకు సన్మానం చేశారు.
Roja
Kalam
Nagari
YSRCP
APIIC

More Telugu News