Vijayawada: విజయవాడలో నాటు వైద్యం వికటించి బాలుడు మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం

  • మరో ముగ్గురు బాలల పరిస్థితి విషమం
  • ఆంధ్రా ఆసుపత్రికి తరలింపు
  • నాటు వైద్యుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయవాడ నగరంలో నాటు వైద్యం వికటించి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లాకు చెందిన హరనాథ్ అనే బాలుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో నాటు వైద్యం కోసం విజయవాడ తీసుకువచ్చారు. అయితే నాటు వైద్యం దుష్ప్రభావం చూపడంతో బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లల పరిస్థితి కూడా విషమంగా మారడంతో వారిని విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరానికి కారకుడైన నాటు వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుద్ధిమాంద్యానికి చికిత్స అంటూ యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రకటనలు ఇచ్చేవాడని గుర్తించారు. విజయవాడలోని గవర్నర్ పేట గంగోత్రి లాడ్జిలో గత నాలుగు రోజులుగా నాటు వైద్యం చేస్తున్నట్టు తెలిసింది.
Vijayawada
Andhra Hospital
Police

More Telugu News