Andhra Pradesh: పోలీసులను కించపర్చిన వాళ్లిద్దరిపైనా ఎందుకు మీసాలు తిప్పలేదు?: పోలీసు అధికార్లకు వర్ల రామయ్య ప్రశ్న

  • పోలీస్ అధికారుల సంఘం నేత శ్రీనివాస్ పై వర్ల ఫైర్
  • మీసాలు తిప్పడం, తొడలు కొట్టడమేంటో!
  • ఏపీ డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదు చేస్తా
ఏపీ పోలీసు అధికారుల జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించడమే కాకుండా, వర్ల రామయ్య తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. పోలీస్ అధికారుల సంఘం చేసిన వ్యాఖ్యలపై వర్ల స్పందించారు.

పోలీస్ అధికారుల సంఘం నేత శ్రీనివాస్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, సవాళ్లు విసరడం ఏంటో అర్థం కావట్లేదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఆయన ప్రస్తావించారు. పోలీసులను కించపరిచిన ఈ ఇద్దరిపై మీసం ఎందుకు తిప్పలేదు? అగ్రవర్ణాలకు చెందిన ‘పెద్ద రెడ్లు’ అని నోరు మెదపలేదా? అని శ్రీనివాస్ ను ప్రశ్నించారు. శ్రీనివాస్ పై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
Andhra Pradesh
police
Telugudesam
varla ramaiah

More Telugu News