Chandrababu: అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో దాడులకు గురైన కుటుంబాలను ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో చంద్రబాబు వైకాపా బాధితులతో భేటీ అయ్యారు. వారికి అండగా ఉండి వారి తరపున పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

తెలుగుదేశం నాయకులపై అక్రమంగా పెట్టే కేసులపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. హైకోర్టులో విషయం తేల్చుకుంటామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు దిగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాగా, జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల నేతలతో సమావేశమైన చంద్రబాబు నేడు మిగతా నియోజక వర్గాల నేతలతో భేటీ కానున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Nellore District

More Telugu News