CM Ramesh: ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమే: సీఎం రమేశ్

  • రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోంది
  • ప్రాంతీయ పార్టీలు బీజేపీని తట్టుకోవడం కష్టం
  • రాయలసీమ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఇక మనుగడ సాగించలేవంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీని తట్టుకోవడం కష్టమని అన్నారు.

రాయలసీమ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి బీజేపీ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ రోజు కడపలో బీజేపీ సంకల్పయాత్ర జరిగింది. సీఎం రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
CM Ramesh
BJP
Telangana
Andhra Pradesh
Sunil Deodhar

More Telugu News