ఆర్టీసీ సమ్మె వెనుక మా పార్టీ నేతలే ఉన్నారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • వారే ఈ సమ్మెకు ఆజ్యం పోశారు
  • కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్న ముత్తిరెడ్డి
  • ఎవరి పేర్లు చెబుతారోనన్న టెన్షన్ 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక తమ పార్టీ నేతలు కొందరు ఉన్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారే ఈ సమ్మెకు ఆజ్యం పోశారని, ఈ విషయాన్ని తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెడుతోంది. ఆయన కేసీఆర్ కు ఎవరి పేర్లు చెబుతారోనన్న టెన్షన్ కొందరిలో నెలకొంది.

ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు నిన్న ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చర్చలు జరిగే అవకాశాలు చిగురించాయి. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
Go Back to Shorts
TRS
Telangana
tsrtc

More Telugu News