పాక్ కు మరిన్ని కష్టాలు.. 'డార్క్ గ్రే' లిస్టులో పెట్టనున్న ఎఫ్ఏటీఎఫ్!
- ఉగ్రవాద నిరోధానికి గతంలో పాక్ కు ఎఫ్ఏటీఎఫ్ 27 సిఫార్సులు
- ఆరింటిని మాత్రమే అమలు
- డార్క్ గ్రే లిస్టులో పెట్టే అవకాశం
ఏ దేశాన్నైనా బ్లాక్ లిస్టులో పెట్టడానికి ముందు డార్క్ గ్రే లిస్ట్ లో పెట్టొచ్చు. అనంతరం బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంటుంది. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాలను అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటానికి ఏ దేశమైనా సహకరించకపోతే బ్లాక్ లిస్టులో పెడతారు. పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ ఈ లిస్టులోకి చేర్చితే అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటివి పాక్ కు గ్రేడ్ తగ్గిస్తాయి. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ప్యారిస్ లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉచ్చులోంచి తప్పించుకోవడానికి పాక్ ఇటీవల పలువురు ఉగ్రవాద నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.