Ravi Babu: అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు: దర్శకుడు రవిబాబు

  • నాగార్జునగారితో సినిమా తీయాలనుండేది 
  •  బాలకృష్ణగారితో సాన్నిహిత్యం ఎక్కువ 
  •  కథలో నుంచి హీరో పుట్టడమే కరెక్టన్న రవిబాబు 
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రవిబాబు మాట్లాడుతూ, అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "మొదట్లో నేను యాడ్స్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడిని.  ఆ తరువాత నా ఆలోచనలు సినిమా వైపుకు మళ్లాయి. మొదట్లో నాకు నాగార్జున గారితో సినిమా చేయాలని ఉండేది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.

ఇక బాలకృష్ణగారితో నాకు మంచి సాన్నిహిత్యం వుంది .. తనతో ఒక సినిమా చేయమని ఆయన నన్ను అడుగుతుంటారు. అయన 'ఒక కథ చెప్పవయ్యా' అంటే నేను ఇంతవరకూ చెప్పలేదు. నా దగ్గరున్న కథల్లో ఎవరు దేనికి ఫిట్ అవుతారనే నేను చూసుకుంటాను. హీరోను అనుకుని కథను తయారు చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ముందుగా కథను సిద్ధం చేసుకుని దానికి ఎవరు సెట్ అవుతారనేది ఆలోచించడం కరెక్ట్ పద్ధతి. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కుదరలేదు" అని చెప్పుకొచ్చాడు.
Ravi Babu
Ali

More Telugu News