Jagan: నేడు నెల్లూరు జిల్లాకు జగన్.. అన్నదాతలకు రైతు భరోసా చెక్కుల పంపిణీ

  • గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి
  • అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి
  • తిరిగి సాయంత్రం గన్నవరానికి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే రైతుభరోసా ప్రారంభోత్సవ సభకు జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు  రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం, అన్నదాతలకు  రైతుభరోసా చెక్కులు పంపిణీ చేసి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రేణిగుంట వెళ్లి విమానంలో గన్నవరం చేరుకుంటారు.
Jagan
Andhra Pradesh
YSRCP
Chittoor District

More Telugu News